13 May, 2026 | 4:45 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

పంట నమోదు పకడ్బందీగా నిర్వహించండి

23-02-2026 05:57 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

షాద్‌నగర్,(విజయక్రాంతి): పంట నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ ల సహాయంతో గ్రామాల్లోకి వెళ్లి పంటల నమోదు చేయాలని కోరారు.

అదేవిధంగా రైతుల నమోదు వేగవంతం చేయాలని తెలిపారు.ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు.అలాగే యూరియా కొరత లేకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ అదనపు సంచాలకులు రమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.