23-02-2026 05:53:07 PM
సుబేదారి ఎస్సై ఫణి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని, సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజీలో జాగృతి పోలీస్ కళాబృందం చేత యువతకు మత్తు పదార్థాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫణి మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్, గుట్కా వంటి మత్తు పదార్థాల బారిన పడకూడదని సూచించారు. గంజాయి విక్రయించిన, వినియోగం జరుగుతున్నట్లయితే, 8712584473 మొబైల్ నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.
అలాగే చదువు ప్రాముఖ్యత ర్యాగింగ్ నివారణ, రోడ్డు ప్రమాదాలను నివారణ, డయల్ 100 సేవలు, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్, ట్రాఫికింగ్, ఆన్లైన్ బెట్టింగ్ సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించామని తెలిపారు. సైబర్ నేరాలకు ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నెంబర్ వినియోగించుకోవాలని కోరారు. జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు పాడిన సామాజిక చైతన్య గీతాలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయని, అనంతరం విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ, అధ్యాపక బృందం, గ్లూకోట్ సిబ్బంది, కళాబృందం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.