పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేష్ మాదిగ
చేగుంట,(విజయక్రాంతి): తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని , మేము కాస్తులోఉన్న అక్రమంగా తన పేరున ఎక్కించుకున్న రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... మాసాయిపేట తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన కుటుంబ సభ్యులు వివరాలకు వెళితే మాసాయిపేట మండల పరిధిలోని పోతన్ పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య గ్రామంలో గల సర్వే నెంబర్ 203 లో 0-25 గుంటల భూమిని 1993 కొనుగోలు చేసినాడు, అప్పటి నుండి వాళ్లు వ్యవసాయం చేస్తూ, కబ్జ్చాలో ఉన్నారు.
ఇట్టి భూమిని రెవెన్యూ శాఖలో,మా పాలోలు అయినటువంటి వ్యక్తి,రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న బర్రె బాబు అక్రమంగా మాకు తెలియకుండా తన పేరున రికార్డుకు నమోదు చేయించుకున్నాడని, ఈ విషయంపై విచారణ జరిపి భూమిని అక్రమంగా తన పేరుపై నమోదు చేయించుకున్న, బర్రె బాబుని సస్పెండ్ చేసి మాకు తగున్యాయం చేయలని మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించారు. తాసిల్దార్ జ్ఞాన జ్యోతిని వివరణ కొరగా, పోతన్ పల్లి గ్రామనికి చెందిన బర్రె సత్తయ్య భూవివాదంపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి, బాధితులకు తగు న్యాయం చేస్తామని తెలియజేశారు.






