23 May, 2026 | 6:45 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం

23-05-2026 06:20 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించినట్లు కొత్తపల్లి ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వచ్చి స్థానికంగా నివసిస్తున్న కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి స్టేషన్ హౌస్ అధికారి ట్రైనీ ఐపిఎస్ సోహం సునిల్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం వలస కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.