చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు
బోథ్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్ల కేసుల్లో విరిగిపోతున్నారని బోత్ జూనియర్ సివిల్ జడ్జి కంభం సందీప్ పేర్కొన్నారు.శనివారం సోనాల మండలంలోని కేశవ్ కూడా సంపత్ నాయక్ తాండ గ్రామాలలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మొబైల్ లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకు ఖర్చు లేకుండా లోక్ అదాలత్ లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం మంచిదని సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దని పేర్కొన్నారు. దేశానికి పల్లెలే పట్టు కొమ్మలని పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. చిన్న పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని సూచించారు.






