23 May, 2026 | 7:15 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు

23-05-2026 06:26 PM

చైర్ పర్సన్ కు, కౌన్సిలర్ లకు సమాచారం లేకుండానే అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడం ఏమిటి

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మున్సిపల్ పాలన సాగిస్తారా

ఎమ్మెల్యే తీరుపై మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఆగ్రహం

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను తన ఎక్స్టెన్షన్ కౌంటర్ గా వాడుకుంటున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి మున్సిపల్ పాలనా? సాగిస్తున్నారా అని చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ఏ నిబంధన ప్రకారం చైర్పర్సన్ కి కౌన్సిలర్లకి సంబంధం లేకుండా మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో కేవలం ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అన్నారు.మున్సిపాలిటీకి ముమ్మాటికి రాజకీయ అధిపతి చైర్పర్స నే అనే విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించాలన్నారు.

ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయాలు…ఇచ్చే ఆదేశాలు ఏమాత్రం చెల్లవు అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కు సమాచారం లేకుండా ఈ సమావేశానికి హాజరైన మున్సిపల్ అధికారుల నుంచి వివరణ కోరుతాము అన్నారు.కామారెడ్డి మున్సిపాలిటీని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి నడిపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మున్సిపల్ చైర్‌పర్సన్  ఇప్ప ఉమారాణి తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపల్ అధికారులందరితో మే 23న శనివారం క్యాంప్ ఆఫీస్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయం నుండి కమిషనర్‌కు లేఖ రావడం, అధికారులపై ఒత్తిడి చేసి సమావేశం నిర్వహించడంపై ఆమె స్పందించారు.

ఈ చర్యను అప్రజాస్వామికమని, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ సమావేశం గురించి ఎన్నికైన చైర్‌పర్సన్‌కు కనీస సమాచారం లేకపోవడాన్ని చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి గారు తప్పుపట్టారు. మున్సిపాలిటీలు రాజకీయ నాయకుల సొంత ఆస్తులు కావు అన్న విషయం లన్న ఎమ్మెల్యే గ్రహించాలన్నారు.74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రజలచే ఎన్నికైన చైర్‌పర్సనే మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి అనే విషయం ఎమ్మెల్యే గ్రహించాలన్నారు. చట్టప్రకారం ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడు మాత్రమే, వారికి ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలు ఉండవు అని ఆమె స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మున్సిపాలిటీకి ఇచ్చే ఆదేశాలు ఏ మాత్రం చెల్లవు అని…ఏ నిర్ణయమైనా మున్సిపల్ కౌన్సిల్ తీసుకోవాల్సిందే ఆని గుర్తు చేశారు.కామారెడ్డి మున్సిపాలిటీని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ యెక్క ఎక్స్టెన్షన్ కౌంటర్ గా మార్చలేరు అని చైర్ పర్సన్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు రాజకీయ బెదిరింపుల కింద పనిచేయవు అని ఆమె హెచ్చరించారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు దిగి   ప్రజల చేత ఎన్నికైన చైర్పర్సన్…కౌన్సిలర్లను పక్కనపెట్టి ఎమ్మెల్యే తన సొంత కార్యాలయంలో సమావేశం నిర్వహించడం తగదన్నారు.

మున్సిపాలిటీ అధికారాలను తుంగలో తొక్కుతూ సమాంతర పరిపాలనను సృష్టిస్తూ, అధికారులపై ఒత్తిడి తెస్తూ స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని ఎమ్మెల్యే దెబ్బ తీస్తున్నారని ఉమారాణి ఆరోపించారు. ఏ అధికారంతో ఎమ్మెల్యే మున్సిపల్ యంత్రాంగాన్ని తన ఆఫీస్‌కు పిలిపించుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ తక్షణమే జోక్యం చేసుకుని మున్సిపాలిటీల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ అప్రజాస్వామిక ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వపరమైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క అధికారి నుంచి వివరణ కోరుతామని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.