23 May, 2026 | 6:46 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్

23-05-2026 06:14 PM

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా దూమల రాజ్ కుమార్ ను నియమిస్తూ శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన  మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య నియామక పత్రం అందచేశారు. అనంతరం దూమల రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఈ నియామకానికి సహకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య కు, తనకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా పాలనా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ  లక్ష్యమని తెలిపారు.