11 April, 2026 | 12:05 PM

Breaking News

భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •  

గ్రూప్‌ 2 అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం

18-10-2025 06:41 PM

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శనివారం నియామక పత్రాల అందజేత కార్యక్రమం శిల్పకళవేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్, డీజీపీ హాజరయ్యారు.  గ్రూప్-2 విజేతలతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆహ్వానం అందింది. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించిన 782 మంది గ్రూప్-2 ఉద్యోగాలకు సీఎం రేవంత్ చేతుల మీదగా నియామకపత్రాలు అందజేస్తారు. 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 2022లో టీజీపీఎస్సీ నోటీఫికేషన్ జారీ చేయగా, గతేడాది డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది ఎంపికయ్యారు. మిగిలిన ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదు.