బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం
- అన్నిరకాల మొక్కలు
- ఆగ్రో నర్సరీవైపు అడుగులు
- నర్సరీ అభివృద్ధికి వేగవంతం
బెల్లంపల్లి, జూలై 3 : ఉమ్మడి జిల్లాలోనే బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీ అత్యంత ప్రసిద్ధి గాంచింది. ప్రారంభ దశలో నర్సరీ అభివృద్ధికి నిధులు పుష్కలంగా మంజూరు చేసే వారు. అప్పటి అధికారులు శ్రద్ధాశక్తులు పె ట్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. అలాంటిది గత పదేళ్లుగా ఈ నర్సరీని పట్టించు కున్న వారే కరవయ్యారు. అధికారుల నిర్ల క్ష్యం వల్ల నర్సరీ పిచ్చి మొక్కలతో కళావిహీనంగా తయారైంది. పూర్తిగా మసకభారి పోయింది.
క్రమేణా నర్సరీ ఉనికినే కోల్పోయింది. ఈ క్రమంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన హెచ్ సి వో రాకతో ఐటీడీఏ నర్సరీ కి నూతన జవసత్వాలు వచ్చా యి. మళ్ళీ ప్రాణం పోసుకుంది. మెల్లమెల్లగా పూర్వ స్థితికి చేరేందుకు పుంజుకుం టున్నది. అన్నిరకాల పూలు, పండ్ల మొక్కల పెంపకంతో నర్సరీకి మళ్ళీ మంచిరోజులు వచ్చేశాయి. వినూత్న తరహాలో మొక్కల పెంపకాలకు నెలవ కానున్నదని స్థానికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆగ్రో నర్సరీగా సరికొత్తగారూపు దిద్దుకుంటుంది. ఈ దిశగా పనులు ముమ్మరమయ్యాయి. ఈ తరహా మొక్కల పెంపకం పైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. మొక్కల్ని మనం పెంచితే అవి మనల్ని కాపాడుతాయి. ఈ నర్సరీ అభివృద్ధి చెందడం వల్ల బెల్లంపల్లికి అదనంగా పర్యావరణ ప్రయోజనాలు చేకూరుతాయి.
- రైతులకు చేయూత..
బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీ అభివృద్ధి కోసం అన్నిరకాల చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా రైతులకు ఉపయోగకరంగా ఈ నర్సరీనీ పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో అధికారులు పనిచేస్తున్నారు. నర్సరీలో ఇబ్బడి ముబ్బడిగా పలు రకాల మొక్కలు ఇప్పటికే పెంచుతున్నారు. వెదురు, వేప, నిమ్మ, మునగ వంటి మొక్కలను పెంచుతున్నారు. ఇవే కాకుండా మామిడిలో అన్ని రకాల పండ్లమొక్కలు పెంచుతున్నారు.
పండ్ల మొక్కలు, మామిడి, అల్లనేరడి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలను రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొన్నటి వరకు మొక్కలు లేక, ఆహ్లాదానికి ఆమడదూరంలో మగ్గిన ఈ నర్సరీ తీవ్ర నిరాధరణకు గురయ్యింది. ఎంతో కాలానికీగాను నర్సరీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. మరికొద్ది రోజుల్లోనే అనూహ్యమైన రీతిలో అందమైన మొక్కలతో బెల్లం పల్లి ఐటీడీఏ నర్సరీ ప్రకృతి రమణీయతతో శోభిల్లనున్నది.
ఇదిలా ఉంటే మొక్కలతో పాటు ఈ ఐటీడీఏ నర్సరీ పేద ప్రజలకు ఉ పాధి కల్పిస్తున్నది. వందలాది మందికి ఇక్క డ పని దొరుకుతున్నది. జీవనోపాధి పొందుతున్నారు. కొంతమందిని ఈ నర్సరీ పోషి స్తున్నది. నిత్యం కూలీలతో నర్సరీ ఆవరణ కళకళలాడుతుంది. గతంలో ఉన్నతాధికారు ల విజిటింగ్‌కు వస్తే ఆశ్రయం కోసం నర్సరీ ఆవరణలో నిర్మించిన గెస్ట్ హౌస్ నిర్వహణ లేక శిథిలమైంది. పాడు పడిపోయింది. పూల మొక్కలు, ఇతర సామాగ్రి స్టోరేజీ స ముదాయం కూడా పనికి రాకుండా పో యింది.
వాటిని మళ్ళీ ఉనికిలోకి తీసుకురావాలనీ కోరుతున్నారు. అందుకు ప్రత్యేక అవసరమైన బడ్జెట్ ను కేటాయించి కొత్త భవనాలు నిర్మించాలి. ఇంకా అవసరమైన సముదాయాలు నెలకొల్పి సందర్శకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. అందమైన పూలమొక్కలు, పచ్చదనాన్ని పరుచుకునీ ఆహ్లాదాన్ని పంచే విధంగా బెల్లంపల్లి నర్సరీని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






