4 July, 2026 | 1:02 AM

మెడికోలకు దారి కష్టాలు!

04-07-2026 12:00 AM
  1. హాస్టల్కు వెళ్లేందుకు విద్యార్థుల నానా అవస్థలు
  2. బురదలోనే రాకపోకలు
  3. పట్టించుకోని కళాశాల యాజమాన్యం, అధికారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 3(విజయ క్రాంతి): మెడికల్ కళాశాల విద్యార్థులు హాస్టల్కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల నుంచి హాస్టల్కు వెళ్లే మార్గం సక్రమంగా లేకపోవడంతో వి ద్యార్థులు ప్రతిరోజూ బురదలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీ వల కురుస్తున్న వర్షాల కారణంగా దారి మొత్తం చిత్తడిగా మారి, నీటిమడుగులు ఏ ర్పడటంతో విద్యార్థుల రాకపోకలు మరింత కష్టతరంగా మారాయి.

కళాశాలలో సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న సుమారు 100 మంది వరకు విద్యార్థులు హాస్టల్లో నివసిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం తరగతులకు హాజరు కావడం, మధ్యాహ్న భోజనం, సా యంత్రం తిరిగి హాస్టల్కు చేరుకోవడం వంటి అవసరాల కోసం కళాశాల నుంచి హాస్టల్కు మూడు నుంచి నాలుగు సార్లు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. సరైన రహదారి లేకపోవడంతో బురదలో జారి పడే ప్రమాదం మధ్యనే నడవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. దారంతా బురదమయంగా మారి చెప్పులు మట్టిలో ఇరుక్కుపోవడం, బట్టలు మురికిగా మారడం, జారి పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాత్రి వేళల్లో హాస్టల్కు వెళ్లేటప్పుడు చీకటి, బురద కారణంగా భయం కలుగుతోందని తెలిపారు.

ఈ సమస్యపై కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి.కనీసం మట్టి దా రిని సరిచేయడం, గ్రావెల్ వేయించి తాత్కాలికంగా రాకపోకలకు అనుకూలంగా మార్గా న్ని అభివృద్ధి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రహదారి సమస్యతో ఇబ్బందులు పడటం బాధాకరమని పలువురు అ భిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం, సంబంధిత శాఖ అధికారులు విద్యార్థులు కోరుతున్నారు.