28 August, 2026 | 8:00 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

శతక్కొట్టిన గౌరవ్‌రెడ్డి

04-07-2026 12:16 AM

నల్లగొండ చేతిలో మెదక్ చిత్తు

తెలంగాణ టీ20 లీగ్

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ టీ20 లీగ్‌లో సెంచరీల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా యువ క్రికెటర్లు శతకాలతో చెలరేగిపోతున్నారు. తాజాగా నల్లగొండ నైట్స్ గౌరవ్ రెడ్డి సెంచరీ సాధించాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌరవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని శతకంతో నల్లగొండ నైట్స్ 181 పరుగుల లక్ష్యాన్ని16.3 ఓవర్లలోనే ఛేదించింది.

అంతకుముందు మెదక్ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. నాయక్ (48), వరుణ్ (44), తేజ (33), రెడ్డి (30) పరుగులతో రాణించారు. నల్గొండ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెదక్ భారీస్కోరు చేయలేకపోయింది. అటు లక్ష్యఛేదనలో పూర్తి ఆధిపత్యం కనబరిచిన నల్గొండ నాలుగో విజయాన్ని అందు కుంది. ఇక మెదక్ జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి.