వైభవ్‌పై ఒత్తిడి పెంచొద్దు
కపిల్ దేవ్ సూచన
ముంబై, జూలై 3: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఎప్పుడు అరంగేట్రం చేస్తాడు ? ఇంకా ఎందుకు తీసుకోలేదు ? అంటూ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. ఇటీవల ఐపీఎల్ సీజన్‌లోనూ దుమ్మురేపడంతో ఈ చిచ్చర పిడుగుపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపి ల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ.. అతడికి ఇంత హైప్ ఇవ్వొద్దని సూచించాడు.
వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ప్ర స్తుతం అతడి గురించి చాలా ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయనీ, వై భవ్‌కు ఇంకాస్త సమయం అవసరమన్నాడు. ఇంత చిన్న వయసు లో నే అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురావొద్దన్నాడు. ఈ వయసులో అ న్నింటినీ అర్థం చేసుకునే అనుభవం ఉండదన్నాడు. సచిన్, కోహ్లీ స్థాయిలోనే వైభవ్ కూడా రాణిస్తాడని అనిపిస్తోందంటూ కపిల్ అంచనా వేశాడు. అయితే అది టీ20 క్రికెట్ లో మాత్రమేననీ, వన్డేలు, టెస్టుల్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉం టుందన్నాడు. వైభవ్ సిద్ధంగా ఉంటే అతని వయసు కాదు.. సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.






