3 July, 2026 | 10:41 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం

03-07-2026 09:51 PM

ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): తిర్యాని మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కవిత భర్త దినేష్ చేపలు పట్టేందుకు వెళ్లి అకాల మరణం చెందడంతో, వారి కుటుంబాన్ని రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సంఘం నాయకులు పరామర్శించారు.ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ముండే ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ స్థానిక ఉప సర్పంచ్‌లతో కలిసి దినేష్‌కు నివాళులర్పించి, కవితను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లందరూ కవితకు అండగా ఉంటారని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుద్యాల రాజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ జంగ అనిల్, వార్డు సభ్యుల జిల్లా ఇంచార్జీ జావిద్, తిర్యాని మండల ఇంచార్జ్ చెన్ని కుమార్, గోయెగాం ఉప సర్పంచ్ ముక్కెర సరిత, సుంగాపూర్ ఉప సర్పంచ్ గడ్డి హరిత అశోక్, కైరీగూడ ఉప సర్పంచ్ సెడ్మాకి మోహన్, గడలపల్లి ఉప సర్పంచ్ సోయం కట్టి, మాణిక్యపూర్ ఉప సర్పంచ్ తిరుపతి, మంగి ఉప సర్పంచ్ కనక శ్రీకాంత్, చింతపల్లి ఉప సర్పంచ్ మడావి నాందేవ్, దేవాయిగూడ ఉప సర్పంచ్ ఆత్రం భీము, ఉల్లిపిట్ట ఉప సర్పంచ్ బోర్‌కుంట యువరాజ్, రోంపల్లి ఉప సర్పంచ్ పెందూర్ వనిత దయాకర్, మెస్రం గూడా ఉప సర్పంచ్ కుడ్మెత రవీందర్, బంబారా ఉప సర్పంచ్ సంతోష్, కోమటిగూడ ఉప సర్పంచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.