30 April, 2026 | 6:54 PM

ఉచిత వైద్య శిబిరంకు స్పందన....

30-04-2026 05:07 PM

సుల్తానాబాద్ ఏప్రిల్ 30 (విజయ క్రాంతి):  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు పరిధిలో అశోక్ నగర్ ప్రైమర్ స్కూల్లో గురువారం వైద్య శిబిరానికి స్పందన లభించింది,  ఈ కార్యక్రమంలో చెస్ట్ కు సంబంధించిన 14 సంవత్సరాలు దాటిన వయస్సు గల వారందరికీ  ఎక్స్రేలు తీయడం స్థానిక కౌన్సిలర్ చింతల రాజు ఆధ్వర్యంలో  జరిగింది, ఈ వైద్య శిబిరాన్ని అవసరం ఉన్న వారందరూ వినియోగించుకోవడం జరిగిందని రాజు అన్నారు, ఈ కార్యక్రమంలో   పల్లె దావకాన డాక్టర్ దివ్య, సూపర్వైజర్ భారతి, ఏఎన్ఎం రమాదేవి, ఆశా వర్కర్లు కోమల, సుగుణ, స్వరూప, సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రాజేశం, అసంపల్లి కనకయ్య, పర్వతం దేవయ్య,  వార్డు ప్రజలు పాల్గొన్నారు.