లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సదాశివపేట బిల్ కలెక్టర్
సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న నిఖిల్ రెడ్డి వద్దకు ఓ బాధితుడు వచ్చాడు. తన ఇంటికి సంబంధించిన టాక్స్ డబ్బులు గతంలో రూ. 41 వేలు ఉండేది. ప్రస్తుతం అది కాస్త రూ.1,0,4000/- కావడంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేనని బాధితుడు మొరపెట్టుకున్నాడు.రూ.50 వేలకు ఇంటి పన్ను తగ్గిస్తానని దానిపై తనకు రూ.35 వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు కొద్ది రోజుల కిత్రం రూ.20 వేలు లంచం కింద మొదటి విడతగా నగదును అందజేశాడు. గురువారం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అదే బాధితుడి వద్ద నుంచి మరో రూ.15 వేలు లంచం తీసుకుంటూ నిఖిల్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఈ వ్యవహారంలో బిల్ కలెక్టర్ పాత్ర మాత్రమే ఉందా లేక ఇతర అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు, బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్ స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






