30 April, 2026 | 6:52 PM

12వ వేజ్ బోర్డు కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలి

30-04-2026 05:08 PM

బీ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ముగుస్తున్నందున కోల్ ఇండియా యజమాన్యం 12వ వేతన సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎం ఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 వేతన సంఘం కాల పరిమితి జూన్ నెలలో ముగుస్తుందని తెలిపారు. 12వ వేతన సంఘం జూలై ఒకటో తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. వేతన సంఘం ఏర్పాటుకు కోల్ ఇండియా యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

బొగ్గు  పరిశ్రమలలో కార్మికుల సమస్యలను నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులను చైతన్యం చేసేందుకు  దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనల కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. 12వ వేతన సంఘం ఏర్పాటు కొరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, ఓపెన్ కాస్ట్ లు డిపార్ట్మెంట్లలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఎమ్ఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కారంపూడి శ్రీనివాసరాజు, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్  డొనికెల రమేష్, ఏరియా కార్యదర్శులు గుర్రం ప్రదీప్ కుమార్,నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షులు చెట్టి వీరన్న, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఊరకొండ తిరుపతి  పాల్గొన్నారు.