14 March, 2026 | 1:08 AM

జాతీయ బ్రిలియంట్ ఒలింపియాడ్‌లో.. రేజోనెన్స్ విద్యార్థుల ప్రభంజనం

14-03-2026 12:00 AM

ఖమ్మం, మార్చి 13(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో గల రేజోనేన్స్ పాఠశాల విద్యార్థులు మరోసారి త మ మేథస్సును చాటుకున్నారు. జాతీయ నేషనల్ బ్రిలియంట్ ఒలింపియాడ్ పరిక్షల్లో ఈ పాఠశాల విద్యార్థి జి. గంగ సిరి అసాధారణ ప్రతిభ కనపరిచి జాతీయస్థాయిలో పత కాన్ని కైవసం చేసుకున్నది. ఈ కార్యక్రమం లో చైర్మన్ ఆర్‌వీ నాగంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ విజేతకి పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.

ఈ సందర్భం గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీ స్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ఇలాంటి జాతీ య స్థాయి ఒలింపియాడ్ పరిక్షల్లో పాల్గొన డం ద్వారా వారిలో విశ్లేషణాత్మక ఆలోచన లు పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని, ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేక అభినందిం చారు. పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయు లు విజేతకు శుభాకాంక్షలు తెలియజేశారు.