14 March, 2026 | 3:50 AM

వైభవంగా భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణం

14-03-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడి

నిజామాబాద్ రూరల్, మార్చి 13(విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ నియో జకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సతీమణి అమ్మమ్మ గ్రామంజక్రాన్ పల్లి మం డలం సికింద్రాపూర్‌లో శుక్రవారం భూ దేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణం శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి.. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గర్భగుడి లో రంగనాయక స్వామిని దర్శించుకొని పూ జలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, పాడిపంటలు సుభిక్షింగా ఉండాలని ప్రార్థించా రు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదం స్వీకరించారు.అంతకుముందు గ్రా మానికి విచ్చేసిన ఎమ్మెల్యేను డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.

పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి ఆల య నిర్మాణం విషయమై విన్నవించగా.. తప్పకుండా తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంతో పా టు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసుకు సాయి రెడ్డి, మండల సర్పం చుల ఫోరం అధ్యక్షులు కౌలాస్ మోహన్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, పార్టీ యువనాయకులు ఉమ్మాజి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పెద్దలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.