10 June, 2026 | 3:13 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

తాండూర్ రోడ్ల సమస్యలు తీర్చండి..

24-03-2026 05:29 PM

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

సానుకులంగా స్పందించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి మంగళవారం బడ్జెట్ సమావేశం జరుగుతుండగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... తాండూర్ – కోట్‌పల్లి ప్రధాన రహదారి, తాండూర్ – తట్టేపల్లి, తొర్మమామిడి రహదారి, పెద్దేముల్ మండలం మరేపల్లి – మదనంతపూర్ రహదారి, బుద్దారం – నాగులపల్లి రహదారి, లక్ష్మీనారాయణపూర్ – దేవనూర్ రహదారి, యాలాల మండలం ముఖ్యంగా కోకట్ బ్రిడ్జి సమస్య తీవ్రంగా ఉందన్నారు.

చిన్న వర్షం వస్తే చాలు బ్రిడ్జిపై నుండి వర్షపు నీరు వెళుతుండడంతో బ్రిడ్జి కోసుకుపోయి ప్రమాదకరంగా మారిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్&బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇస్తూ, తాండూర్ నియోజకవర్గంలోని రహదారి నిర్మాణాలు మంజూవ్వడంతో పాటు సంబంధిత పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే నెలలో పనులు కూడా ప్రారంభమవుతాయని సభలో హామీ ఇచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని రోడ్లు బాగు పడే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.