14 July, 2026 | 5:56 PM

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

14-07-2026 05:12 PM

భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించి పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తపస్సు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మంగళవారం రాష్ట్ర పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని రిక్రూట్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని, కాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓ రమేష్ రాథోడ్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శశిరాజ్, రాజేశ్వర్, సుదర్శన్ తదితరులు ఉన్నారు.