14 July, 2026 | 5:49 PM

రేపు ఎమ్మెల్యే చేత అభివృద్ధి పనులు ప్రారంభం

14-07-2026 05:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యే బిజీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు లక్ష్మణ మాజీ జెడ్పిటిసి పద్మ రమేష్ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రాజాపూర్ లో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభిస్తారు. తిరుపతిలో 20 లక్షలతో నిర్మించి సీసీ రోడ్డు అభివృద్ధి పనులు లక్ష్మణ చందా మండల కేంద్రంలో 30 లక్షలతో నిర్మించి అగ్రికల్చర్ గోదాం పండ్లకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల ఉద్దేశించి సర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బిజెపి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు.