3 June, 2026 | 4:12 AM

ప్రభుత్వ అండదండలతో జలమండలి కార్మికుల సమస్యల పరిస్కారం

03-06-2026 01:51 AM

జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు..

ముషీరాబాద్, జూన్ 2(విజయక్రాంతి): జూన్ 6న జరిగే జలమండలి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏడు కార్మిక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈయూ) అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి త్రిశూలం గుర్తుపై ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు , కార్మిక సంఘాల నాయకులు కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మొగుళ్ల రాజిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనను గెలిపించి పెండింగ్ ఉన్న జలమండలి కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయ ఆవరణలో మంగళవారం తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎమ్యెల్యేలు దానం నాగేందర్, కాలె యాదయ్య, నవీన్ యాదవ్, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు జి. సత్యజిత్ రెడ్డి, టీజేఈయూ అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్, ఎఐటియుసి సీనియర్ నాయకులు విఎస్ బోస్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు కె.రాజిరెడ్డి,

జనరల్ సెక్రటరీ ఇ.చంద్రశేఖర్, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొని జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ జలమండలిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని, కార్మికలోకాన్ని వేరుచేసి చూడలేమన్నారు. ముఖ్యంగా కార్మికులకు కావాల్సింది వారికి అండగా నిలిచే నాయకుడు పుల్ల రాజిరెడ్డి అని అన్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి మా ట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మికుల పక్షాన పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరించిందని అన్నారు. కార్మికులను కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ను గుండెల్లో పెట్టుకొని కాపాడుతుందని చెప్పారు.ఈ సమా వేశంలో టీజేఈయూ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవాన్ కుమార్, మేవ అధ్యక్షులు సయ్యిద్ అక్తర్ అలీ, ఏఐటీయూసీ నాయకులూ రమేష్, టీజేఈయూ నాయకులు బి.శంకర్ ప్రకాష్, బి.నర్సింగ్ రావు పాల్గొన్నారు.