19 July, 2026 | 4:05 AM

మండాడి.. మైత్రి ద్వారా తెలుగులోకి

19-07-2026 01:27 AM

మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ నిర్మాత. ఈ సినిమాలో సుహాస్, సూరి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10న ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది.

తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ విడుదల చేయనుంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్ కాగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీల క పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్ అందించగా, ఎస్‌ఆర్ కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.