26 July, 2026 | 2:23 AM

రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

26-07-2026 12:14 AM

వామపక్ష విద్యార్థి సంఘాలు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాధించిన ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, యువతకు జేజేలు తెలుపుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, కార్యదర్శి పి.నాగరాజు, ఏఐడీఎస్‌ఓ కేంద్ర సంయుక్త కార్యదర్శి హరీష్ కుమార్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.అశోక్ రెడ్డి, ఎం.రమ్య, లెనిన్, జూనుగరి రమేష్, నాగేంద్ర, ఎండి.జావేద్ తదితరులు పాల్గొన్నారు.