రిమాండ్ ఖైదీ పరారీ
26-07-2026 12:31 AM
వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చిన పోలీసులు
సిద్దిపేట క్రైం, జూలై 26(విజయక్రాంతి): పట్టపగలే రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లు గప్పి పారిపోవడం సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. ఎన్సాన్‌పల్లి శివారులోని జిల్లా జైలు నుంచి ఏడుగురు ఖైదీలను వైద్య పరీక్షల కోసం పోలీసులు సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
వారిలో బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాయికుమార్ అనే నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకొని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో వెతికారు. నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.






