కలిసిరాని కాలం..!
- మొహం చాటేసిన వరుణుడు
- జూన్ ప్రారంభంలో గింజలు నాటిన రైతులు
- మట్టిలోనే మాడిపోయిన విత్తనాలు
- నిండా మునిగిన కౌలు రైతులు
- ఆరుతడి పంటల సాగుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని విన్నపాలు
- రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
సంస్థాన్ నారాయణపూర్, జూలై 24: సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన రైతు ఎర్రోళ్ల నరసింహ అనే రైతు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మృగశిర కార్తె ప్రా రంభంలో 15 ప్యాకెట్ల పట్టి గింజలను కూ లీల సాయంతో నాటాడు.అప్పటినుండి వర్షాలు లేకపోవడంతో గింజలు మొలకెత్తలేదు.
లింగవారిగూడెం గ్రామానికి చెందిన కత్తుల విజయ్ రైతు తనకున్న 4 ఎకరాలతో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిగింజలు నాటుకున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన విత్తనాలు మొలకెత్తక భూమిలోనే మాడిపోయాయి. కౌలు డబ్బు లు ముందుగానే చెల్లించాలని కూలీల డబ్బు లు దున్నడానికి ట్రాక్టర్ ఖర్చులు విత్తనాల ఖర్చులు అన్ని కలిపి లక్షకు పైగా ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండి వ్యవసాయం అధిక దిగుబడి రావడంతో ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురు స్తాయని రైతులు ముందుగానే వ్యవసాయ పనులను మొదలు పెట్టారు.జూన్ మాసం కంటే ముందుగా కురిసిన కొద్దిపాటి వర్షాలకే చాలామంది రైతులు విత్తనాలు నాటు కున్నారు.కొంతమంది రైతులు తమకు ఉన్నదానితో పాటు మరికొంత కౌలుకు తీసుకొని సేద్యం ప్రారంభించారు.కానీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక పోవడంతో తీవ్రంగా నష్టపోయారు.
పత్తి సాగుతో పలితం సున్నే :
నారాయణపురం మండలంలో అత్యధికంగా వరి, కంది వంటి పంటలకు ప్రాధా న్యత ఉన్నప్పట్టికీ వాణిజ్య పంట అయిన పత్తికి ఈ మధ్య కాలంలో రైతులు అధిక ఆసక్తిని చూపుతున్నారు. ఎకరానికి 3 నుండి 4 ప్యాకెట్ల పత్తి విత్తనాలను నాటుతూ వాణిజ్య సాగుకు శ్రీకారం చుట్టారు. వేల ఎకరాలలో విత్తనాలు వేసినా వర్షాభావ పరిస్థితులతో వేసిన విత్తనాలు మొలవకపోగా కొన్ని చోట్ల మొలిసిన మొక్క నీరు లేక మాడిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏమి చేయాలో అర్థంకాక దిక్కుదోచని పక్షుల్లా ఆకాశం వైపు చూస్తూ కూర్చుండిపోయారు.
అయోమయంలో అన్నదాత :
ప్రభుత్వ అధికారులు వర్షాభావ పరిస్థితుల వలన ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నప్పటికీ వారికి ఏ పంటలను వేసుకోవాలనే అవగాహన కల్పించడంలో సరైన ప్రయత్నం చేయడం లేదనే చర్చలు సాగుతుండటం గమనార్హం. ప్రతి గ్రామంలో భూ ముల స్వభావాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకుంటే నష్టపోకుండా దిగుబడి సాధించవచ్చు అనే విషయాలను రైతులకు వివరిస్తే కొంత మేలు జరుగుతుందని అనుభవజ్ఞులైన కొందరు రైతులు చెబుతున్నారు.
ప్రస్తుత ఎల్ నినో ప్రభావాన్ని ఎలా అధిగమించవచ్చనే విషయాలను, లాభదాయకంగా ఎ లాంటి పంటలను సాగు చేయాలనే అంశాలపై వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం దనీ వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తం ఉన్న నీటి వనరులతో తమకు లాభం జరుగుతుందని నమ్మి వరి, పత్తి వంటి పం టలను సాగు చేస్తున్నారని, సమీప రోజులలో ఇలాగే వర్షాభావ పరిస్థితులు ఎదురైతే పంట మొక్కలను బతికించుకునేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
దీంతో రైతులు ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రస్తుత పరిస్థితిలో ఈ పం టలను సాగు చేయాలి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించి మందుల రైతులకు ఈ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
రెండు లక్షలు ఖర్చు పెట్టాం
‘వర్షాలు కురుస్తాయని 15 ఎకరాలలో పత్తిని సాగు చేయడానికి ఏర్పాట్లు చేసు కొని విత్తనాలు నాట డం జరిగింది కాని వర్షాలు కురవక పోవడంతో దాదాపుగా రెండు లక్షలకు పైగా నష్టపో యాం. కౌలు ఎకరానికి పది నుండి ప న్నెండు వేలు ముందుగానే చెల్లించాం. తీరా వర్షాలు కురవక పోవడంతో తీ వ్రంగా నష్టపోతున్నాం’
కత్తుల విజయ్,
రైతు, లింగవారి గూడెం
ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంచుకోవాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక తీవ్ర వ ర్షాభావ పరిస్థితులు నెలకొ న్న సందర్భం లో రైతులు ఎప్పుడూ పండించే వరి, పత్తి వంటి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎన్నుకోవాలి. తక్కు వ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను రైతులు సాగుచేయాలి.
పూజ, ఏఓ,
సంస్థాన్ నారాయణపురం
ప్రభుత్వమే ఆదుకోవాలి
‘గతేడాది లాగా వర్షాలు కురుస్తాయని అప్పులు చేసి మరీ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న. సేద్యానికి దాదాపుగా రెండు లక్షలకు పైగా ఖర్చు చేసిన.బలమైన కార్తెలు వెళ్లిపోతున్నా వర్షాలు కురవడం లేదు. ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి నష్టపరిహరం అందజేయాలి.’
చింతకింది శ్రీరాములు,రైతు, నారాయణపురం






