25 July, 2026 | 1:06 AM

కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత

25-07-2026 12:05 AM
  1. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు 
  2. ప్రశ్నా పత్రాన్ని కాపాడలేని వారు దేశాన్ని ఎలా కాపాడుతారు?
  3. సీనియర్ కాంగ్రెస్ నేత వినోద్‌రెడ్డి

ముషీరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఢిల్లీలో రాహుల్‌గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీ ఛార్జీ, అరెస్టులను ఖండి స్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ సీనియర్ నేత వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో హి మాయత్ నగర్ కూడలి నుంచి హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు కాంగ్రెస్ నాయకు లు ర్యాలీ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మె ల్యే క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు,  కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వినోద్‌రెడ్డి డిమాండ్ చేశారు.

22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని మండిపడ్డారు. ప్రశ్న పత్రాలను కాపాడలేని నాయ కులు దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.