25 July, 2026 | 12:59 AM

‘బళ్లారి- గుంతకల్లు’కు గ్రీన్ సిగ్నల్

25-07-2026 12:00 AM
  1. మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం  
  2. రూ.1,264 కోట్ల కేటాయింపులు
  3. ఏపీ - కర్ణాటక మధ్య మెరుగైన రైల్వే కనెక్టివిటీ
  4. ఉపాధి, పరిశ్రమలు, పర్యాటకానికి కొత్త ఊపు
  5. ‘భవ్య రసాయన’ పథకానికి కూడా ఆమోదం 
  6. మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 

ఢిల్లీ, జూలై 24 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు దక్కింది. బళ్లారి---గుంతకల్లు మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి  కేంద్ర ఆమోదం లభించింది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా వ్యవస్థలో పారదర్శకత, పారిశ్రామిక ప్రోత్సాహానికి సంబంధించిన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బళ్లారి--- గుంతకల్ రైల్వే మార్గం లో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి ఆ మోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. రూ. 1,264 కోట్లు కేటాయించింది. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు 2028---29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా అమలుకానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు  జిల్లాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.

మొత్తం 46 కిలో మీటర్ల మేర అదనపు రైల్వే లైన్ నిర్మించనుండగా, 99 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది. దీంతో సుమారు 7 లక్షల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు ఎం తో కీలకంగా మారనుంది.

ముఖ్యంగా ఇను ప ఖనిజం, బొగ్గు, ఉక్కు, ఎరువులు, సిమెం ట్, పంట ఉత్పత్తులు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు ఈ అదనపు లైన్లు దోహదపడనున్నా యి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భారతీయ రైల్వే కు ఏడాదికి అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

పర్యావరణ పరిరక్షణకు దోహదం

పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజె క్టు ఉపయోగపడనుంది. రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గడంతో  ఏటా సుమారు 1.32 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని క్యాబినెట్  అంచనా వేసింది. అలాగే దాదాపు 6.67 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశముందని పేర్కొంది. దీంతో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యాల సాధనకు ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.

అలాగే బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబా టులోకి రానుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల రాకపోకలు మరింత సాఫీగా సాగనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక వద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురా యిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

‘భవ్య రసాయన’ పథకానికి రూ.3,030 కోట్లు

దేశీయ రసాయన పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.3,030 కోట్ల విలువైన ‘భవ్య రసాయన’ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దేశం లో రసాయన తయారీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగు తాయని కేంద్రం అంచనా వేస్తోంది.