రైల్వే వంతెన నిర్మాణం త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి
ఘట్ కేసర్, మే 11 (విజయ క్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనులు త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కి మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ సోమవారం స్థానిక నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఘట్కేసర్ పట్టణంలో జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణం పనుల నిమిత్తం కాంట్రాక్టర్ కు రావాల్సిన నిధులు ఇటీవల మంజూరు కాగా ఇప్పటి వరకు నిర్మాణం పనులు మొదలు పెట్టలేదని కావున సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభింప చేసి త్వరలో నిర్మాణం పూర్తి చేసి వంతెన ప్రజలకు అందుబాటులో కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ కోరారు.
మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు, ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా సంబంధిత కాంట్రాక్టర్ కి పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారని తెలిపారు. మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, మాజీ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు నాగరాజు, నాయకులు సల్మాన్ రాజ్, సాయి యాదవ్, పాల్గొన్నారు.






