12 May, 2026 | 1:29 AM

పంటల కొనుగోలులో అవినీతి అక్రమాలను అరికట్టాలి

12-05-2026 12:32 AM

సిపిఎం  జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు 

భద్రాద్రి కొత్తగూడెం, మే 11, (విజయక్రాంతి): జిల్లాలో దాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలులో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అధికారులు, రైస్ మిల్లర్స్ ఏకమై రైతులకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఆరు కాలం కష్టపడి పంటలు పండించి అమ్మే సమయంలో ప్రభుత్వం ఆరురకాల టెస్ట్ లు నిర్వహించి వాటిలో పాస్ అయితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారని దానివల్ల రైతులు ధాన్యం ప్రభుత్వం కొనలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క సుజాతనగర్ లోనే 12 టన్నుల ధాన్యం అమ్మకానికి రైతులు తీసుకొస్తే కేవలం 360 టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు.

లేకుంటే తరుగుల పేరుతో ఐదు నుంచి పది కిలోలు ధాన్యం అదనంగా ఇస్తే కొంటామనీ రైస్ మిల్లు యజమానులు బాహటంగా చెబుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.  24 వేల రూపాయలు క్వింటాకు మద్దతు ధర ప్రభుత్వం పేర్కొంటే కేవలం 1700 మాత్రమే చెల్లిస్తున్నారని ఇది రైతులని మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉందని, అధికారులు యొక్క కా అలసత్వం వల్ల ప్రవేటు దళారులు విచ్చలవిడిగా రాజ్యం వెళుతున్నారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ జిల్లాలో రైతాంగం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదన్నారు.  ఒకవైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకపోగా ఈ జిల్లా ప్రాజెక్టుల పట్ల మంత్రులు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యధోరణి తో వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.  సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చి హక్కు కల్పించాలని, క్యాస్ట్ సర్టిఫికెట్స్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు  పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, లీక్కీ బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్ పాల్గొన్నారు.