26 May, 2026 | 3:16 AM

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి

26-05-2026 12:52 AM

మేడ్చల్ అర్బన్ మే 25(విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి ఎం నరేష్ మాట్లాడుతూ గతంలో మేడ్చల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ ప్రస్తుతం జిహెచ్‌ఎంసి లో విలీనం కావడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమని తెలిపారు.

మున్సిపల్ కార్మికులకు గత 6 నెలల నుండి పిఎఫ్ డబ్బులు కటవుతున్న వారి అకౌంట్లో పడటం లేదనే విషయాన్ని గుర్తు చేశారు.ప్రొఫెషనల్ టాక్స్ పేరు మీద 535 రూపాయలు టిడిఎస్ మీద 400 రూపాయలను జీతం నుండి కట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని నరేష్ చెప్పారు.కార్మికులకు ఇచ్చే జీతాలే చాలీచాలని జీతాలుగా అందులో నుండి ప్రొఫెషనల్ టాక్స్,టిడిఎస్ పేరు మీద కట్ చేస్తే కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాబట్టి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

మేడ్చల్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్మికులకు చెల్లిస్తున్న వేదనాలను మేడ్చల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించి ప్రమాదంలో మరణించిన కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. మేడ్చల్ సర్కిల్ కార్మికులు సిఐటియు నాయకులు గణేష్. ఎన్ మల్లేష్. రవి.ఎం మల్లేష్, లక్ష్మారెడ్డి, మధు, సంతోష్, రాజు, శ్రీకాంత్. రాము. బిక్షపతి. శివ. లక్ష్మణ్ పాల్గొన్నారు.