మండల అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని వినతి
కొండపాక, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కొండపాక మండలానికి చెందిన సర్పంచులు గురువారం కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి, కొండపాక మండల అధ్యక్షుడు వాసరి లింగారావు ఆధ్వర్యంలో మంత్రిని కలిసి మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను వివరించారు.
వినతులను పరిశీలించిన మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, అభివృద్ధి పనుల అమలుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెలికట్ట గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు, జప్తి నాచారం సర్పంచ్ పావని శశిధర్ రెడ్డి, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ కొయ్యడ వెంకటేశం, బందారం గ్రామ సర్పంచ్ కొలుపుల గంగయ్య, ప్యాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ సర్పంచులు మంత్రికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. మంత్రి సానుకూల స్పందన పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.






