5 June, 2026 | 10:10 AM

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

05-06-2026 01:45 AM

ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ 

మరిపెడ (మహబూబాబాద్) జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని వార్డు సభలు, మున్సిపల్ కౌన్సిలర్ల పర్యవేక్షణలో  మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీ పాల్ రెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డో ర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచం ద్రు నాయక్, ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హా మీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షే మ పాలన అందిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళల ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, గృహ అవసరాల భారాన్ని తగ్గించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజా పాలన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అభివృద్ధి ఫలాలు ప్రతీ అర్హుడికి వరకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు, విద్యా, వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే, నరేష్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ ఆఫీసర్,బి.వీరా సింగ్, వార్డు కౌన్సిలర్స్ మెరుగు రాము, జాటోత్ సురేష్ నాయక్, పానుగోతు రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అఫ్జల్, వెంకన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.