ఉద్యమకారులను గుర్తించండి
ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సీఎంను కలిసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధులు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యమకారుల త్యాగాలకు తగిన గౌరవం కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి సంబంధించిన చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్య మకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే.కేశవరా వు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివా రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రే వంత్‌రెడ్డిని కలిసింది.
ఉద్యమకారుల గుర్తింపు, వర్గీకరణ, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో కమిటీ చ ర్చించింది. హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం ‘అమరదీపం’ వద్ద నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాల ను కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో 13 వేల మందికిపైగా తెలం గాణ ఉద్యమకారులతో పాటు వివిధ జేఏసీ లు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులు పా ల్గొన్నట్లు వివరించింది.
ఈ సంప్రదింపుల్లో వచ్చిన అభిప్రాయాలు, విజ్ఞప్తులను క్రోడీకరి ంచడంతో పాటు ఉద్యమకారుల వర్గీకరణ కు సంబంధించిన ముసాయిదా నివేదికను సమర్పించింది. ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని, వారికి తగిన గౌరవం కల్పిం చాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను సులభ తరం చేసేందుకు సహకారం అందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
సీఎం దృష్టికి ప్రధాన డిమాండ్లు
ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లను కూ డా కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. 250 గజాల నివాస స్థలం, ఆసరా పెన్షన్, ఆరోగ్య కార్డులు, ఆర్టీసీలో ఉచిత ప్రయా ణ సౌక ర్యం, ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యమకారులుగా గౌరవ గుర్తింపు తదితర అంశాలపై చర్చించింది.
ఎన్నికల హామీ మేరకు జీవో నెం.679 ద్వారా ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేయడం, సంక్షేమ మాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్నందు కు కమిటీ చైర్మన్ కే. కేశవరావు, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మోతె శోభన్‌రెడ్డి, ఎస్. రాములునాయక్ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వీ.పీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






