హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ మొక్కల పంపిణీ
- వనమహోత్సవం2026లో భాగంగా కార్యక్రమం
- ‘హైదరాబాద్ 5కే రన్’ వేదిక వద్ద విశేష స్పందన
హైదరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): వనమహోత్సవం2026లో భాగంగా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో శనివా రం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ‘హైదరాబాద్ 5కే రన్’ వేదిక వద్ద ఉచిత మొ క్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
5కే రన్‌కు వచ్చిన వారికి, సందర్శకులకు వివిధ రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయగా, ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, నివాస సముదాయాలు, అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో పచ్చదనాన్ని విస్తరించేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ద్వా రా అర్బన్ పార్కుల అభివృద్ధి, అవెన్యూ, సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్లు, ల్యాండ్‌స్కే ప్ అభివృద్ధి, నర్సరీల నిర్వహణతో పాటు ప్రజలకు ఉచిత మొక్కల పంపిణీ వంటి కా ర్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
కార్యక్రమాన్ని హెచ్‌ఎండీఏ అర్బ న్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి, అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్)దోనేపూడి చక్ర పాణి పర్యవేక్షణలో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నిఖిల్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సౌమ్య, నిఖిల్ కుమార్, అర్బన్ ఫారెస్ట్రీ సిబ్బంది నిర్వహించారు. మొక్కలను నాటి, వాటిని సంరక్షించ డం ద్వారా హరిత హైదరాబాద్ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.






