30 August, 2026 | 4:00 AM

సంచార జాతుల అభివృద్ధికి.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

30-08-2026 01:42 AM
  1. 31న ‘విముక్త దివాస్’గా నిర్వహించాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్,ఆగస్టు 29 (విజయక్రాం తి): ఆర్ధికంగా, రాజకీ యంగా, సామాజికం గా అన్ని రంగాల్లో వెనుకబడిన సంచార జా తుల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.

సంచార, విముక్త జాతుల ఐక్యవేదిక(ఎన్టీ,డీఎన్టీ, ఎస్‌ఎన్టీ) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమా వే శంలో కృష్ణయ్య మాట్లాడుతూ సంచార జాతులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతి కుటుంబానికి 20 లక్షలు రుణాలు ఇ వ్వాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ (సీటీఏ 1871) రద్దయిన ఆగస్టు 31న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ‘విముక్త దివాస్’గా నిర్వహించాలన్నారు.

సం చార జాతుల కుటుంబాల విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలన్నారు.డీఎన్టీ, జేఏసీ కన్వీనర్ మీనగ గోపి బోయ మాట్లాడుతూ సంచార, అర్ధ సంచార, విముక్త జా తుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏ ర్పాటు చేయాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. స్థిర నివాసం లేని కుటుంబాల కు శాశ్వత నివాస స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,

కులఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 31న ‘విముక్త దివాస్’ నిర్వహణకు ప్రభుత్వం వెంట నే జీవో జారీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెల ంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్, బీసీ సంఘం నాయకులు రాజేందర్, చిక్కుడు పాల్గొన్నారు.