గ్రామాల అభివృద్ధి పనులపై ఖమ్మం కలెక్టర్‌కు వినతి
తిరుమలాయపాలెం మే 19 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని సుద్ధవాగు తండా గ్రామ పంచాయతీ ముజాహిద్పురం గ్రామాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనుల విషయమై సర్పంచ్ ఆర్మీ రవి ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకరను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు తదితర అంశాలపై కలెక్టర్కు వివరించారు.
గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాలని కోరారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలను పరిశీలించి, ఆయా అభివృద్ధి పనులకు మంజూరు కల్పించి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ ఆర్మీ రవి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు.






