19 June, 2026 | 3:29 AM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

19-06-2026 01:57 AM

మేడ్చల్ అర్బన్, జూన్18 (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎల్లంపేట మున్సిపల్ అధికారులకు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి ఎం .నరేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు మే నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో లాగా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిర ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వారికి ఇవ్వాల్సిన బట్టలు, సబ్బులు షాంపులు చెప్పులు బ్లౌజులు జాడుకట్టలు షూస్ టార్చ్ లైట్ హెల్మెట్ ఇతర సదుపాయాలు కల్పించాలని, మున్సిపల్ కార్మికులకు 60 లక్షల ఇన్సూరెన్స్ స్కీములు ఇంప్లిమేషన్ చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను తొలగిస్తే వాళ్లకు 15 లక్షల ఎక్స్క్రీష్ ఇవ్వాలని వారసులు ఉన్నవారికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఒకరిని ఉద్యోగంలో పెట్టుకోవాలని ఈ అంశాల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ మండల ఉపాధ్యక్షులు డి నరసింగరావ్, మున్సిపల్ కార్మికులు సత్యనారాయణ, నర్సమ్మ, లక్ష్మి, రేణుక, రత్నం, తదితరులు పాల్గొన్నారు.