19 August, 2026 | 4:03 AM

చేతిపంపునకు మరమ్మతులు

19-08-2026 12:00 AM

బూర్గంపాడు, ఆగస్టు18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఏజీహెచ్‌ఎస్ ఆశ్రమ పాఠశాల వద్ద పాడైన చేతిపంపునకు సర్పంచ్ మందా నాగరాజు స్పందించి మంగళవారం మరమ్మతులు చేయించారు. చేతిపంపు పనిచేయడం లేదని పాఠశాల వార్డెన్ పద్మావతి సోమవారం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే స్పందించిన సర్పంచ్ పంచాయతీ సిబ్బందితో చేతిపంపునకు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.