19 August, 2026 | 5:00 AM

కాళేశ్వరం గర్భగుడి కూల్చివేత

19-08-2026 12:00 AM

నిపుణుల పర్యవేక్షణలో నిర్వహణ

ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం

భూపాలపల్లి/ కాళేశ్వరం, ఆగస్టు 18 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆలయ పూర్వపు గర్భగుడి నిర్మాణాన్ని నిపుణుల పర్యవేక్షణలో పూర్తిగా కూల్చివేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగానే పాత నిర్మాణాన్ని తొలగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ఈఓ మహేష్, ఆర్‌అండ్‌బీ డీఈఈ దేవేందర్ ఆధ్వర్యంలో నిపుణుల సూచనలు, పర్యవేక్షణతో ప్రొక్లెయినర్ సహాయంతో గర్భగుడి పాత నిర్మాణాన్ని జాగ్రత్తగా తొలగించారు. కాగా రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకాం చుట్టింది. ఆలయ అభివృద్ధి పునిర్నిర్మాణ పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.198 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.