మిషన్ హీరా ఆధ్వర్యంలో హెల్త్ స్క్రీనింగ్ డ్రైవ్
26-07-2026 12:35 AM
హైదరాబాద్, జూలై 25: వ్యాధులను ముందస్తుగా గు ర్తించడంపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఫౌండర్ కిరణ్మయి మిషన్ హీరాలో భాగంగా గైనకాలజిస్ట్ డాక్టర్ సారదతో కలిసి కమ్యూనిటీ హెల్త్ స్క్రీనింగ్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు.
పాప్ స్మీ యర్ స్క్రీనింగ్-, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్,- -ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్- పరీక్షలు చేశారు. ప్రతీక్ గోండా స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో 50 మందికి పరీక్షలు నిర్వహించారు. మిషన్ హీరా ద్వారా భవిష్యత్తులో మరి న్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవస్థాపకురాలు కిరణమయి అలివేలు తెలిపారు.






