26 August, 2026 | 2:31 AM

మతోన్మాది సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలి

26-08-2026 01:23 AM

కాకినాడ ఘటన అత్యంత దారుణం 

వీహెచ్‌పీ నేత పగుడాకుల బాలస్వామి

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న కాకినాడ ఘటన అత్యంత దారుణమని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముక్ పగుడాకుల బాలస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన సాదిక్ ఖాన్‌ను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. గుట్టుగా పరువుతో బతుకుతున్న నూకరాజు కుటుంబాన్ని సమాధి చేసిన సాజిద్ బతకడానికి వీల్లేదన్నారు.

పెళ్లయి పిల్లలున్న కాపురంలో చొరబడి లవ్ జిహాద్ పేరుతో సౌజన్యను వెంటాడి, వేటాడి అత్యంత కిరాతకంగా హింసించడం హేయం అన్నారు. సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి తమ ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని తెలిసి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులు ఉపయోగించే విష పదార్థాలు, కెమికల్స్ కలిపి విష ప్రయోగం చేసి జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసిన సాదిక్ నరరూప రాక్షసుడు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా బాధితుల వాంగ్మూలాలతో కూడిన లేఖను పరిగణనలోకి తీసుకొని సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు.