‘సర్’ జాబితాలో లేకపోతే..! శాశ్వతంగా లేనట్టే..
ప్రభుత్వ అధికారులు శని, ఆదివారం కూడా పని చేశారు
ఓటర్ల్లారా.. తస్మాత్ జాగ్రత్త..?
ఓటు నమోదు చేసుకోవాలంటే అనేక తిప్పలు తప్పవు
చేవెళ్ల జూలై 1౦ (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విసి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లతో సర్ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోల్చితే హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఎమినేషన్ ఫామ్స్ పూర్తిస్థాయిలో డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. ఈ కారణంగా వివిధ శాఖలకు చెం దిన ప్రభుత్వ ఉద్యోగులు శనివారం ఆదివారం సర్లో పాల్గొని 50% ఎమ్మినరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఆదేశించారు.
ఇందులో పంచాయతీరాజ్ సిబ్బంది, బిఎల్వోలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, ఫీల్ అసిస్టెంట్ తో పాటు సామాజిక బాధ్యతగా విద్యావంతులు స్టూడెంట్స్ సర్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో ప్రభుత్వ అధికారాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చేవె ళ్ల ఆర్డిఓ పార్థసారథి తహసిల్దార్ కృష్ణయ్య స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఇమినరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి విద్యావం తులు విద్యార్థులు ఓటర్లకు సహకరించాలి.
నియోజకవర్గంలో ఇదివరకు 32% ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేశామని శనివారం ఆదివారం రెండు రోజుల్లో 50 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశించారని చెప్పారు. సర్లో గనుక ఓటు మిస్ అయితే మళ్లీ ఓటు హక్కు పొందడానికి స్థానిక నిరూపణ కోసం అనే రకాల ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎమ్యూనరేషన్ ఫామ్స్ లేకుంటే ఎపిక్ నెంబర్ సంబంధిత తాహాసిల్దార్ కు పంపితే మరో ఫామ్ ఇస్తామని వెల్లడించారు. సర్ నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా సహకరించాలని ఆర్డీవో తెలిపారు.






