కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా రేగటి రవి గౌడ్
తుంగతుర్తి( విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం రోజు తుంగతుర్తి మండల అధ్యక్షులుగా రేగటి రవి గౌడ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తన ఎన్నికకు కృషి చేసిన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ల సహకారం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామాల్లోని నాయకులు, యువజన నాయకుల కలుపుకపోతు, ఐకమత్యంతో, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బంధువులు, మేధావులు, జర్నలిస్టులు, హర్షం వ్యక్తం చేశారు.






