3 July, 2026 | 11:50 AM

వేశ్య కాంతుల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

03-07-2026 10:46 AM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి వేశ్యకాంతుల చెరువు పునరుద్దరణ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం ప్రారంభించారు.. ఈ సందర్బంగా రైతులు తో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 

వేశ్యకాంతుల చెరువు వద్ద స్టోన్ పిచ్చింగ్, చెరువు కు ఇరువైపులా స్టీల్ రైలింగ్, జంగిల్ క్లియరింగ్, కట్ట మీద నడవటానికి మరమ్మత్తుల పనులు మరియు బతకమ్మ   ఘాట్ నిర్మాణం పనుల పూజా కార్యక్రమం చెయ్యటం జరిగింది . ఎమ్మెల్యే రాగమయి దయానంద్  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్  ఆధ్వర్యంలో .

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్ నరసింహ , మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ  చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్స్ తోట సుజాల రాణి , హకీమ్,పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు,మున్సిపల్ ఏయ్  ఇరిగేషన్ జేఈ సీనియర్ బొంతు వేణు, విరివాడ భూషణం,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..