10లక్షలు ఇస్తే.. 40లక్షలు అకౌంట్ లో వేస్తాం
- అమాయకులను దొచుకుంటున్న మూఠా అరెస్ట్..
- 12 మంది దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితులలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్*
- 17 లక్షల నగదు, మూడు కార్లు, డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు స్వాధీనం
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్..
ఖమ్మం, సత్తుపల్లి, జులై 2 (విజయక్రాంతి): మేము రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాం.. బ్లాక్ మని చాలా ఉంది.. వైట్ మని రూ.10లక్షలు ఇస్తే రూ.40లక్షలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం అంటూ కొందరు దుండగులు అమాయకులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు దొపిడి చేస్తున్నారు. సినిమా పక్కిలో అమాయకులను పోలీసులు మంటూ బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులతో హుడాస్తున్నారు. అలాంటి ముఠాను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మార్గములో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అమాయకులను మోసం చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. గురువారం సత్తుపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్లూరు ఏసిపి మాట్లాడుతూ.. జూన్ 25న సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మోసపోయిన బాధితుడైన కడప జిల్లా, పొద్దుటూరు కు చెందిన కుర్రా. గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది నిందితులు డమ్మీ చిల్డ్రన్ నకిలీ కరెన్సీ తో అమాయక ప్రజలను మోసంచేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీస్ బృందం బుధవారం ఉదయం గంగారం లో తనిఖీ చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. ఈ కేసులో గంగరాం 15 వ. బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్సై బేరా కేశవరావు లు కూడా వున్నారని పేర్కొన్నారు. నిందితుడు ముందుగా సిమ్ కార్డులను తీసుకొని ఆ సిమ్ ల ద్వారా ఏదో ఒక నంబర్ కు ఫోన్ చేసేవాడిని, ఎవరైనా అమాయకులు ఫోన్ ఎత్తితే “నా పేరు మహేందర్ రెడ్డి, @ బాలగంగాధర్ @ చంద్రం @ చంటి బాబు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెబుతూ... నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను, నా ఎకౌంట్లో 2 కోట్ల రూపాయలు బ్లాక్ మని వున్నది, నాకు ఇన్కమ్ టాక్స్ సమస్యలు వున్నాయి. నేను అట్టి బ్లాక్ మని ని వైట్ మని గా మార్చాలను కుంటున్నాను. మీరు ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే అందుకు బదులుగా మీకు ఒకటికి, నాలుగు రెట్లు డబ్బులు ఇస్తాను, అట్టి డబ్బులను నగదు రూపములో గాని, ఎకౌంట్ ద్వారా గాని ఇస్తాను అని చెప్పి, మీరు నా మీద నమ్మకం వుంచి నేను చెప్పిన చోటుకు డబ్బులు తీసుకొని వస్తే , మా మనిషి మీ వద్దకు వస్తాడు, అతనికి ఆ డబ్బులు చూపించి, మీ ఎకౌంట్ నంబర్ ఇస్తే నేను ఒకటికి, నాలుగు రెట్లు డబ్బులు మీ ఎకౌంట్లో వేస్తాను, మీరు 10 లక్షల రూపాయలు కనుక నాకు డబ్బులు ఇస్తే మీకు 40 లక్షల రూపాయలు మీ ఎకౌంట్ లో వేస్తాను, మీరు ఆ డబ్బులలో నుండి పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని , నాకు మీరు ఇచ్చిన పది లక్షలు పోను మిగతా పద్దెనిమిది లక్షలు నాకు క్యాష్ ఇవ్వండి అని వారికి ఈ విధముగా ఆకర్షించే మోసపు మాటలు చెప్పేవాడిని తెలిపారు.
మాటలు నమ్మి చెప్పిన చోటకు వచ్చే వ్యక్తులకు నమ్మకం కలిగించేలా మాటలు చెప్పి తన మనిషిని వారి వద్దకు "డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు" వున్న బ్యాగును ఇచ్చి పంపేవారని, ఇచ్చిన ఒరిజినల్ డబ్బులు తన మనిషి లెక్కబెట్టే సమయములో ముందుస్తూ ఏర్పాటు చేసుకున్న ముఠా సభ్యులలోని ఒరిజినల్, నకిలీ పోలీసులు ముందే ఏర్పాటు చేసుకున్న కార్లలో వెళ్ళి వారిని దొంగనోట్లు వ్యాపారం చేస్తున్నారని, లేదా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని వారిని బెదిరించి , అవసరమైతే వారిని, వాళ్ళతో పాటు ముఠా ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మనిషిని కూడా వారికి అనుమానం రాకుండా కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని వచ్చేలా ముందే పధకం వేసుకొని ఒక కుట్ర పన్ని దోపిడీ చేస్తున్నారని తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులు ..
ఏ1గా ఏలూరు జిల్లాకు చెందిన ఈద చంటి బాబు, ఏ2గా ముళ్ళగిరి వర్ధన్, టీజీఎస్పీ కానిస్టేబుల్, తుంబూరు, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, ఏ3గా మువ్వా సత్యనారాయణ, టీ.నర్సాపురం గ్రామం, మండలం, ఏలూరు జిల్లా. ఏ4గా బేరా. కేశవరావు టీజీఎస్పీ ఆర్ఎస్ఐ 15వ.బెటాలియన్ బేతుపల్లి గంగారాం, సత్తుపల్లి, ఖమ్మం. ఏ5గా మారుముడి మధు, క్యాబ్ డ్రైవర్, మల్లాయిగూడెం, చింతలపూడి, ఏలూరు. ఏ6గా గోరంట్ల గౌతమ్ కుమార్, బీరపల్లి, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా,
ఏ7గా కర్లపూడి నవీన్ సదాశివపురం, నేలకొండపల్లి, ఖమ్మం. ఏ8గా నక్కా నాగరాజు, తుంబూరు, సత్తుపల్లి, ఖమ్మం. ఏ9గా సాగి సుబ్బరాజు కొడగట్టుపల్లి, రావులపల్లి, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఏ1౦గా కాపా శ్రీనివాస్, ఏఎస్. రావు నగర్, సికింద్రాబాద్, ఏ11గా దుడుగురు కురబ గణేష్, శ్రీ కృష్ణ నగర్, కర్నూలు జిల్లా. ఏ12గా ఉపేంద్రం జనార్ధన రాజు, రాజేంద్ర నగర్, ధర్మవరం, సత్యసాయి జిల్లా. ఏ13 గా రామాంజనేయలు, ఎ14గా రాజు (సిమ్ కార్డులు అందించివారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు పరిశోధనలో భాగముగా అరెస్టు చేసిన నిందితులు ఏ-1 నుండి ఏ-12 వరకు అరెస్టు చేసి రిమాండు కు పంపనైనది. ఇట్టి కేసులో ఏ-13, ఏ-14 లు పరారీలో వున్నారని తెలిపారు.
ప్రాపర్టీ రికవరీ..
నిందితుల నుంచి రూ.17,60,000 నగదు 2 ఇన్నోవా వాహనాలు 1 ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ స్కూటీ,
16 సెల్ ఫోన్లు, పోలీస్ యూనిఫామ్ 500 రూపాయల డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీ 80 బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.






