3 July, 2026 | 11:39 AM

సీసీ రోడ్డుపై బురద..పట్టించుకోని అధికారులు

03-07-2026 10:29 AM

బెజ్జూర్ జూలై 03,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సీసీ రోడ్డుపైనే బురద ఉండడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువలు లేకపోవడంతో పాటు,వేసిన సిసి రోడ్డుపై సైతం మట్టి పేరుకుపోయి ఉండడంతో ద్విచక్ర వాహనాలు అద్భుతప్పి కింద పడిపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.