3 July, 2026 | 11:51 AM

ఘట్ కేసర్ సర్కిల్ డివిజన్ లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

03-07-2026 10:51 AM

ఘట్ కేసర్, జూలై 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్ లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధ్యక్షులను నియమించింది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Medchal District Congress Party) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సూచనల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని 16 డివిజన్ లకు అధ్యక్షులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్ కేసర్ 6 డివిజన్ కు అధ్యక్షులుగా బొక్క ప్రభాకర్ రెడ్డి, ఎదులాబాద్ 7వ డివిజన్ కు  అధ్యక్షులుగా సామల అమర్, పోచారం 8వ డివిజన్ కు అధ్యక్షులుగా కర్రె రాజేష్ లను నియమించారు.

పార్టీ బలోపేతానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి డివిజన్ లకు అధ్యక్షులుగా నియమించడం జరిగిందని  పార్టీ అధిష్టానం ప్రకటించింది. డివిజన్ లకు నియమితులైన అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాపై  కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అధ్యక్షులుగా నియమించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, అందుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.