3 July, 2026 | 11:26 AM

​రంగారెడ్డి ‘హస్తం’లో జంబో రచ్చ

03-07-2026 10:26 AM
  1. సారథి లేని కమిటీ.. అసంతృప్తి సెగలు!
  2. ​కార్యవర్గం అయితే వచ్చింది.. కానీ ‘కురుపు’ మిగిల్చింది!
  3. ​113 మందితో కాంగ్రెస్ జిల్లా కమిటీ నియామకం
  4. ​పాత అధ్యక్షుడినే కొనసాగిస్తూ పీసీసీ ఉత్తర్వులు
  5. ​డీసీసీ పీఠం దక్కక కుంగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు

​రంగారెడ్డి, జులై 3(విజయక్రాంతి): ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గం విడుదలైంది. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా భారీ కసరత్తు అనంతరం 113 మందితో కూడిన ‘జంబో’ కమిటీని ప్రకటిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఈ నెల 29 న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కమిటీ నియామకం పార్టీలో ఉత్సాహాన్ని నింపడం పక్కన పెడితే.. కొత్త వివాదాలకు, అసంతృప్తులకు తెరలేపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కొత్త ప్రెసిడెంట్లతో కూడిన సరికొత్త బాడీలను నియమించిన అధిష్టానం.. రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మాత్రం పాత జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డినే కొనసాగిస్తూ జంబో కమిటీని సర్దేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

డీసీసీ పీఠంపై ఆశలు గల్లంతు.. నేతల్లో తీవ్ర నిరాశ

​రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి (డీసీసీ) పై ఈసారి భారీగా ఆశలు పెట్టుకున్న చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీమ్ భరత్, బడంగ్పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, జిల్లా సీనియర్ నేత దేపా  భాస్కర్ రెడ్డి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావించిన నేతలకు మళ్లీ పాత సారథినే కొనసాగించడం మింగుడుపడటం లేదు. డీసీసీ పోస్టు కోసం జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు గత కొన్నాళ్లుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. తమకే అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్లకు పలుదఫాలుగా వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ, అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పాత కమిటీ సారథ్యానికే జంబో హంగులు అద్దడంతో ఆశావహులు కినుక వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల డిసిసి సారతులను నియమించిన పార్టీ అధిష్టానం.. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సారథిల నియామకంలో.. మాత్రం తర్జనభజన పడుతుంది.

​‘ఓట్లకేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ జపం.. పదవులకేమో రెడ్డి సామాజికవర్గమా?’

​"పార్టీ పటిష్టత కోసం ఏళ్ల తరబడి కిందిస్థాయిలో కష్టపడుతున్న మాకు గుర్తింపు ఎక్కడ? ఎన్నికల వేళ ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జపం చేసే నాయకత్వం.. కీలకమైన డీసీసీ పదవుల పంపకాల్లో మాత్రం తాత్సారం చేస్తోంది. గతంలోనూ రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు, ఇప్పుడు అదే పునరావృతమైంది."

- జిల్లా కాంగ్రెస్ అసంతృప్త నేతలు

​జిల్లాలో డీసీసీ నియామకంపై కిందిస్థాయి క్యాడర్ సైతం భగ్గుమంటోంది. సామాజిక న్యాయం పాటించడంలో పార్టీ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించి, డీసీసీ ఎంపికలో పారదర్శకత పాటించాలని, జంబో కమిటీకి పూర్తిస్థాయి న్యాయం జరిగేలా కొత్త సారథిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

* ​జంబో కమిటీలో ఎవరెవరికి చోటు?...

​పార్టీ కోసం శ్రమించిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్స్, సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు.

 ​ఉపాధ్యక్షులు వీరే:

​కొత్తకుర్మ మంగమ్మ, ఇ. సతీష్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, పుట్టగళ్ల జగన్, చెన్నగారి నర్సింహ, ఎర్రం భాస్కర్ రెడ్డి, రామచంద్రయ్య, చీకుర్తి గోపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, జి.శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వరం నర్సింహ, నజీర్ బాయ్, ఎం.వెంకట్ రెడ్డి, ఇ.బద్రీనాథ్, కె.శ్రీనివాస్.

​ప్రధాన కార్యదర్శులు:

​ఎర్ర మహేందర్, జె.విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీ శ్రీధర్, నేనావత్ రాజు నాయక్, చిలుక ఉపేందర్ రెడ్డి, ఎం.డి.ఇబ్రహీం, గోవర్దన్ గౌడ్, అంబటి ప్రభాకర్, ఎ.మాధవ రెడ్డి, తలారి మైసయ్య, ఎం.డి. జమాలుద్దీన్, జి.శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఎస్. అంతిరెడ్డి, జె.రేణుక, చేగూరి... (మరియు ఇతరులు).

​స్పోక్స్ పర్సన్స్ & కార్యదర్శులు:

​ఎం.డి.ఇస్తియాక్ గుల్షాని, బాదేపల్లి సిద్ధార్థ, పెంటారెడ్డి, దుర్గం శ్రీహరి గౌడ్, వై.వెంకటేశ్ గౌడ్, ఎం.శ్రీనివాస్, బి. రమాకాంత్ రెడ్డి, మహేందర్ యాదవ్...

కార్యదర్శులుగా: అంగిడి నగేష్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, నాగిళ్ల శేఖర్, శేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్, జంగయ్య, అజ్మత్ బాబా అలీ, అంజిరెడ్డి, పాలమూరు యాదయ్య, సాయిలు, నర్సింహులు, వంశీ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బర్ల యాదయ్య, అనంతరాములు, ఎం.డి.షమీ, మాణిక్యం, రాజిరెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, తిరుపతి, ఎం.లింగారావు, సూర్య ప్రకాష్ రావు, వినోద్, ఆవుల రవీందర్, ఎస్.శిరీష, సయ్యద్ తాహీర్ హుస్సేన్, కె. వెంకట రమణారెడ్డి, సి. వెంకటేశ్, వి.మాణయ్య, కె.యాదయ్య గౌడ్, రాజు, లలిత, బి.శ్రీకాంత్ యాదవ్, రవీంద్రారెడ్డి, ముజఫర్ ఖురేషీ, బాబర్ నవాజ్, సబావత్ మధుకర్, ఆర్.లింగం, వి.శ్రీరాములు గౌడ్, ఎన్. రమేష్ గౌడ్, బి.జంగమయ్య గౌడ్, కె. కొండల్ రెడ్డి, కె.సాయి కిరణ్ గౌడ్, సీహెచ్ రమేష్, పి.రేణు గౌడ్, జి.లతా గౌడ్, సయ్యద్ రిజ్వాన్, నరేష్ గుప్తా.

​ఎగ్జిక్యూటివ్ మెంబర్లు:

​నాగేందర్ గౌడ్, మదన్పాల్ రెడ్డి, అమర్నాథ్రెడ్డి, పి.యాదయ్య, రమేష్ గౌడ్, ప్రకాష్ గుప్తా, గఫార్, ఆవుల రవి, నాజి నాయక్, గండయ్య, బాల్ రెడ్డి, లక్ష్మీపతి గౌడ్, తిమ్మారెడ్డి, జి. నాగార్జున రెడ్డి, రజిని రావు.

క్షేత్రస్థాయిలో సవాలే!

​113 మందితో భారీ కమిటీని వేసి క్యాడర్‌లో జోష్ నింపాలని చూసిన అధిష్టానానికి, సామాజిక సమతుల్యత (సోషల్ బాలన్సింగ్ ) మరియు డీసీసీ పీఠం లొల్లి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. పదవులు పొందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అసంతృప్త జ్వాలలను చల్లార్చి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడం పాత అధ్యక్షుడికి, కొత్త జంబో కమిటీకి పెను సవాల్ అనే చెప్పాలి.