మల్లాయిగూడెంలో జీపీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
03-07-2026 10:44 AM
కూసుమంచి, జులై 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సహకారంతో మంజూరైన నూతన గ్రామపంచాయతీ భవన శుభారంభానికి సూచికగా నిర్వహించిన ముగ్గు పోసే కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ అభివృద్ధికి మరో ముందడుగుగా నిలిచే ఈ నూతన పంచాయతీ భవనం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీఓ, ఎంపీవో, గ్రామ కార్యదర్శి, సర్పంచ్ బాదావత్ నరేష్, ఉప సర్పంచ్ జవ్వాజి లావణ్య పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.






